బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 20:49:36

అవినీతిపై అసెంబ్లీలో నిల‌దీద్దాం.. ఇప్పుడొద్దు: ‌దేవేగౌడ‌

అవినీతిపై అసెంబ్లీలో నిల‌దీద్దాం.. ఇప్పుడొద్దు: ‌దేవేగౌడ‌

బెంగ‌ళూరు: కరోనా వైర‌స్ విజృంభిస్తున్నందున ప్ర‌భుత్వాన్ని అవినీతిపై ప్ర‌శ్నించ‌డానికి ఇది స‌మ‌యం కాద‌ని క‌ర్ణాట‌క‌కు చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ అన్నారు. ప్ర‌స్తుతం విప‌క్ష పార్టీలు ప్రజల ఆరోగ్యంపైనే దృష్టి సారించాలని, రాజ‌కీయాలు త‌గ‌ద‌ని క‌ర్ణాట‌క‌లోని విప‌క్ష పార్టీల‌కు సూచించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. అవినీతి అంశాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తవచ్చని చెప్పారు. 

క‌రోనా సామగ్రి కొనుగోలులో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం రూ.3,000 కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్ప‌డింద‌ని, దీనిపై దర్యాప్తు జరిపించాలని పలువురు విపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విప‌క్షాలు రాజ‌కీయాలు చేయొద్ద‌ని దేవెగౌడ సూచించ‌డం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, క‌రోనా సామగ్రి కొనుగోలులో నిధుల దుర్వినియోగం ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo