బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 00:38:50

అజిత్‌జోగి ఆరోగ్యం విషమం

అజిత్‌జోగి ఆరోగ్యం విషమం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగి (74) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంటివద్ద శనివారం ఉదయం గుండెపోటు రావడంతో చికిత్స కోసం రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో ఆయనను అడ్మిట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామన్నారు. 2000 నవంబర్‌లో ఆవిర్భవించిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టానికి అజిత్‌జోగి తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు. 2000 నవంబర్‌- 2003 నవంబర్‌ మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. తర్వాత కాంగ్రెస్‌తో విభేదించి జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జే) అని సొంత పార్టీని ఏర్పాటు చేశారు. 


logo