శనివారం 04 జూలై 2020
National - Jun 16, 2020 , 22:20:38

కరోనాతో మాజీ ఎంపీ కన్నుమూత

కరోనాతో మాజీ ఎంపీ కన్నుమూత

ముంబై: కరోనా వైరస్ సోకి మాజీ ఎంపీ హరిభావ్ జవాలే (67) ఇవాళ సాయంత్రం కన్నుమూశారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు నాలుగు రోజులక్రితం ముంబై నగరంలోని లీలావతి దవాఖానకు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు కొవిడ్-19 మందులు ఇస్తూ చికిత్స అందించారు . అయినప్పటికీ ఫలితం లేకపోక సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 

తన స్వగ్రామమైన భాలోడ్ లో ఉన్న సమయంలోనే ఆయన కు తీవ్రంగా జ్వరం వచ్చిందని సన్నిహితులు చెప్తున్నారు. సొంతూరు నుంచి ముబైకి వచ్చిన తర్వాత ఇక్కడే కొద్ది రోజులు చికిత్స తీసుకొన్నారు. చివరకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో లీలావతి దవాఖానకు తరలించారు. అక్కడ కరోనా వైరస్ చికిత్స అందించగా.. తుదకు కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జల్గావ్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించిన హరిభావ్ ప్రస్తుతం బీజేపీ జల్గావ్ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. హరిభావ్ జవాలే మరణించడంతో ఆయన నివాసానికి తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయన  భౌతిక కాయం వద్ద ఘనంగా నివాళులర్పించారు.


logo