ఆ ఇంట్లో అంతా ఎరుపు, తెలుపు రంగులే!

ప్రతి వ్యక్తికీ తనకంటూ అభిమానించే రంగులు ఉంటాయి. కొందరు పసుపు రంగును ఇష్టపడగా.. ఇంకొందరు ఆకుపచ్చ రంగును ఎక్కువగా కోరుకుంటారు. మరికొందరేమో గులాబీ రంగే కావాలంటారు. అయితే, బెంగళూరులో నివసిస్తున్న ఈ 58 ఏండ్ల సేవన్రాజ్ కుటుంబానికి మాత్రం ఇష్టమైన రంగులు ఎరుపు, తెలుపు. వీరు ఈ రంగులను ఎంతగా ఇష్టపడతారో వారి ఇంటిని చూస్తే అర్థమవుతుంది.
సేవన్రాజ్ ఇంట్లోని ఫర్నిచర్, కర్టెన్లు, మొబైల్స్, గోడలు, కార్లు, కార్యాలయాలు, అద్దాలు, బూట్లు-సాక్సులు, మరుగుదొడ్లు, దంతాల బ్రష్‌లే కాకుండా ధరించే డ్రెస్సులు కూడా ఎరుపు, తెలుపు రంగులే వాడుతుండటం విశేషం. ఆయన భార్య పుష్ప కూడా తన ఇంటికి ఈ రెండు రంగుల్లో ఉండే వస్తువలనే కొనుగోలు చేస్తుంది. తండ్రి ఇష్టానికి ప్రాముఖ్యతనిస్తున్న కుమారుడు భరతరాజ్, కుమార్తె మనీషా కూడా ఎరుపు మరియు తెలుపు రంగు దుస్తులనే ధరిస్తారు. తల్లిదండ్రుల ఏడవ సంతానంగా ఉన్నప్పుడు సేవన్రాజ్కు ఈ పేరు వచ్చింది. చిన్నప్పటి నుంచి ప్రపంచానికి భిన్నంగా కనిపించాలని అనుకునేవాడు. తొలుత ఎరుపు, తెలుపు రంగు దుస్తులు వేసుకోవడం చాలా మంది ఈయనను ఇట్టే గుర్తించేవారంట. దాంతో అప్పటినుంచి తాను ఏది కొనుగోలు చేసినా ఇవే రెండు రంగులు ఉండేంట్లు చూసుకుంటున్నారు. 'నాకుటుంబంలో ప్రతి ఒక్కరూ తెలుపు రంగును ఎక్కువగా ఇష్టపడతారు. నాకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ రెండు రంగులను ప్రేమించడం మొదలెట్టాను.. నేను చనిపోయే వరకు ఈ రెండు రంగులతోనే జీవిస్తానని ప్రమాణం చేశాను. మొదట ప్రజలు నా పాయింట్‌ను చూసి నవ్వేవారు. కానీ నా అభిరుచిని చూసి వారు కూడా అలవాటుపడిపోయారు అని చెప్తున్నారు సెవన్‌రాజ్.
అతని ఇంటి అల్మారాలు ఎరుపు, తెలుపు దుస్తులతో నిండి ఉన్నాయి. రెడ్ అండ్ వైట్‌లో తనకంటూ ముద్ర వేసుకోవడమే కాకుండా జీవితంలో 7 సంఖ్యను కూడా స్వీకరించాడు. ఏడును ఆయన తన అదృష్ట సంఖ్యగా భావిస్తాడు. తన ప్రతి దుస్తుకు 7 బటన్లు, 7 పాకెట్స్ ఉంటాయి. అతని కారు నంబర్ ఏడు. చివరకు ఆయన ఏడు భాషలు కూడా మాట్లాడతారు. ఈయన రెడ్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు.. చాలా మంది సెల్ఫీలు తీసుకోవడానికి వస్తారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పుజారా అలా చేస్తే.. నా సగం మీసం తీసేస్తా!
- 223 ఫీల్డ్ రెజిమెంట్‌తో గన్ సెల్యూట్
- ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- కేటీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- మోదీ పగిడీ.. ఇదీ ప్రత్యేకత
- నమస్తే తెలంగాణ ఆఫీసులో గణతంత్ర వేడుకలు
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి
- 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చిరు
- మీ 'టిప్' కో దండం సారూ...!
- ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు