శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 11:47:26

ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిడ్ టీకా.. బీహార్‌లో బీజేపీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో

ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిడ్ టీకా.. బీహార్‌లో బీజేపీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో

హైద‌రాబాద్‌:  బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ఇవాళ కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.  బీహార్ రాష్ట్ర ప్ర‌జ‌లు రాజ‌కీయంగా చాలా సున్నితంగా ఉంటార‌ని, వారికి రాజ‌కీయ ప‌రిజ్ఞానం కూడా ఎక్కువే అన్నారు.  పార్టీలు చేసే వాగ్ధాల‌ను వారు అర్థం చేసుకుంటార‌ని ఆమె అన్నారు.  ఎన్‌డీఏ ప్ర‌భుత్వం హ‌యంలో.. బీహార్‌లో జీడీపీ బాగా పెరిగింద‌న్నారు.  3 శాతం నుంచి 11.3 శాతానికి గ‌త 15 ఏళ్ల ఎన్డీఏ పాల‌న‌లో పెరిగిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌న్నారు.  కోవిడ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. బీహార్‌లో ప్ర‌తి ఒక పౌరుడికి ఉచితంగా ఆ టీకా ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ చెప్పారు.  మా ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో మేం చేసిన తొలి వాగ్ధానం ఇదే అని మంత్రి అన్నారు.  పాట్నాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి నిర్మ‌లా.. బీహార్ ఎన్నిక‌ల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఎన్డీఏకు ఓటేసి గెలిపించాల‌ని ఆమె ప్ర‌జ‌ల్ని కోరారు.  మ‌రో అయిదేళ్ల పాటు నితీశ్ కుమార్ సీఎంగా ఉంటార‌న్నారు.  ఆయ‌న పాల‌న‌లోనే బీహార్ ఉత్త‌మ రాష్ట్రంగా  అభివృద్ధి చెందుతుంద‌ని ఆమె అన్నారు.