మంగళవారం 31 మార్చి 2020
National - Mar 22, 2020 , 13:14:28

కోవిడ్‌పై సమరంలో ప్రతి ఒక్కరూ సైనికులే : మోదీ

కోవిడ్‌పై సమరంలో ప్రతి ఒక్కరూ సైనికులే : మోదీ

హైదరాబాద్‌: కోవిడ్‌-19ను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ సైనికులే అవుతారని ప్రధాని మోదీ అన్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆయన ఆదివారం ట్విట్టర్లో స్పందించారు. మీరు జాగ్రత్తగా ఉంటే.. లక్షల మంది ఆరోగ్యానికి సహకరించినట్లు అవుతుందని పేర్కొన్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో విలువైన సమయాన్ని ఇంట్లోనే కుటుంబంతో గడుపాలని ప్రధాని సూచించారు. కరోనాపై పోరాటంలో భాగంగా దేశంలోని ప్రముఖులంతా ‘స్టే ఎట్‌ హోమ్‌'ను ఎంకరేజ్‌ చేస్తున్నారని తెలిపారు. జనతా కర్ఫ్యూ సమయంలో డిజిటల్‌ పేమెంట్స్‌ వైపు మొగ్గుచూపాలని ప్రధాని కోరారు.   logo
>>>>>>