ఆదివారం 05 జూలై 2020
National - Jun 24, 2020 , 10:14:28

ఉడుత ఆహారం తినేట‌ప్పుడు వ‌చ్చే శ‌బ్దం అద్భుతం!

ఉడుత ఆహారం తినేట‌ప్పుడు వ‌చ్చే శ‌బ్దం అద్భుతం!

పెద్ద చెట్ల‌కు కాసే చాలా పండ్ల‌ను మ‌నుషుల కంటే ముందుగా ఉడుతలే రుచి చూస్తాయి. వాటికి ఎలా తెలుస్తాయో కానీ బాగా పండుమాగిన పండ్ల‌నే కొంచెం కొంచెం కొరికి తింటాయి. పూర్తిగా తింటాయా అంటే.. తిన‌వు. స‌గం కొరికి ప‌డేస్తాయి. అయితే.. ఉడుత‌లు ఎలా తింటాయి. అవి తినేట‌ప్పుడు ఎటువంటి శ‌బ్దం వ‌స్తుందో అని చాలామందికి సందేహం ఉంటుంది.

ఉడుత‌లు ప‌రుగెడుతుంటేనే చాలా ముచ్చ‌టేస్తుంది. ఆగి ఆగి ప‌రుగెట్టే ఉడుత‌లు తిండి కూడా అలాగే తింటాయా అని చాలామంది అనుకుంటూ ఉంటారు.  జువాల‌జిస్ట్‌, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్ 'డాని కాన‌ర్'  మైక్రోఫోన్ స‌హాయంతో ఆహారం తింటున్న ఉడుత ఎటువంటి శ‌బ్దం చేస్తుందో వినిపించారు. "నేను నా మైక్రోఫోన్‌ను 7 వారాల శిశువు ఎర్ర ఉడుత (సిక్) ముందు ఉంచాను" అనే క్యాప్షన్‌తో ఆమె వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇటీవ‌ల డానీ కాన‌ర్ త‌ల్లి మ‌ర‌ణించ‌డంతో తోడుగా నాలుగు ప‌సి శిశువు ఉడుత‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. ఈమె ట్విట‌ర్ ఖాతాలో అన్నీ మూగ‌జీవాల చిత్రాలే ఉంటాయి.  


logo