శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 17:43:09

ఏనుగు మ‌సాజ్ చేయ‌డం ఎప్పుడైనా చూశారా? మ‌నుషులు కూడా చేయ‌రేమో!

ఏనుగు మ‌సాజ్ చేయ‌డం ఎప్పుడైనా చూశారా? మ‌నుషులు కూడా చేయ‌రేమో!

ఎవ‌రైనా బాగా అల‌సిపోయిన‌ప్పుడు కాస్త ఆయిల్ వేసి చేతితో అలా అలా మ‌ర్ద‌నా చేస్తే నువ్వొక మ‌సాజ్ సెంట‌ర్ పెట్టుకోవ‌చ్చు క‌దా అని అంటారు. ఈ ఏనుగును చూసిన‌ప్పుడు కూడా అదే అంటారేమో. మ‌నిషిక‌న్నా ఎంతో ఒర్పుగా మ‌సాజ్ చేస్తూ అంద‌రి ప్ర‌సంశ‌లు అందుకుంటున్న‌ది. రాజీవ్ అగ‌ర్వాల్ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. అందుకే ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

45 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో ఒక ఏనుగు మ‌నిషి కాలును ప‌ట్టుకొని స్కూటీని ప్రారంభించ‌కుండా ఆపుతుంది. మనిషి స్కూటీ మీద కూర్చునేట‌ప్పుడు మ‌ళ్లీ హెల్మెట్ తెచ్చి పెడుతుంది. త‌ర్వాత స‌న్నివేశంలో మ‌నిషి బాల్‌ను బుట్ట‌లో వేయ‌లేక నిరుత్సాహ‌ప‌డుతుంటే తొండంతో పైకెత్తి బుట్ట‌లో వేసేలా చేసింది. త‌ర్వాత అత‌నికి న‌డుం నొప్పిగా ఉంటే ఆయిల్ పూసి మ‌సాజ్ చేసింది. తోటి మ‌నిషిక‌న్నా ఎంతో ప్రేమ‌గా చూసుకున్న ఈ ఏనుగును చూస్తే ఎంతో అసూయ క‌లుగుతుంది. ఇలాంటి ఏనుగు మాకెందుకు లేదంటూ.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. 

  


logo