సోమవారం 13 జూలై 2020
National - May 26, 2020 , 11:50:17

పనసపండు కావాలా నాయనా..

పనసపండు కావాలా నాయనా..

ఈ మధ్య సోషల్‌ మీడియాలో వన్యప్రానులే ఎక్కువగా తారసడుతున్నాయి. అందులో ఎక్కువగా గజేంద్రుడు ప్రత్యక్షమవుతున్నాడు. తమ అల్లరి పనులతో అందరినీ అలరిస్తున్నాడు. మొన్నటికి మొన్నమట్టిలో దొర్లుతూ సేదతీరుతున్న వీడియో బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అలానే సీజన్‌లో వచ్చే మామిడికాయలను తొండంతో కోసి తింటున్న వీడియో. ఇప్పుడు ఏకంగా పసన చెట్టే ఎక్కేసింది.

మనుషులు లేకుండా జంతువులు బతకగలవు కాని, జంతువులు లేకుండా మనిషి జీవించలేకున్నాడు. అడవిలో ఉన్న ఈ ఏనుగుకి పనస చెట్టు కనిపించింది. పనసపండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పండుని చూడగానే నోరూరినట్టున్నది. చెట్టు పొడవుగా ఉండడంతో పండ్లు అందలేదు. అందుకని ముందున్న రెండు కాళ్లతో సగం చెట్టు ఎక్కి తొండంతో లటుక్కున లాగేసుకున్నది. ఈ వీడియోను ఇండియన్‌  ఫారెస్ట్ అధికారి సాకెత్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘పనసపండు మీద ఉన్న ప్రేమ చెట్టుని ఎక్కేలా చేసింది’ అనే క్యాప్షన్‌ జోడించాడు. ‘డీసెంట్‌ స్టీలింగ్’‌, ‘ఈ ఏనుగుకు పనసపండు అంటే ఇష్టం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


logo