బుధవారం 08 జూలై 2020
National - Jun 17, 2020 , 14:56:00

ర‌య్.. ర‌య్‌మ‌నే.. ప్యాకెట్ సైజ్ సూప‌ర్ బైక్‌!

ర‌య్.. ర‌య్‌మ‌నే.. ప్యాకెట్ సైజ్ సూప‌ర్ బైక్‌!

బైక్ రైడ్ అంటే ఇష్టం లేని వారుండ‌రు. ఎండ త‌గ‌ల‌కుండా కారులో ఏసీ పెట్టుకొని వెళ్ల‌డం కంటే బైక్ మీద వెళ్ల‌డానికే చాలామంది ఇష్ట‌ప‌డ‌తారు. బైక్ మీద వెళ్లేట‌ప్పుడు ర‌క‌ర‌కాల‌ విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోష‌ల్‌మీడియాలో చూస్తూనే ఉన్నాం. అలా మినీ బైక్‌లను న‌డ‌పడం కూడా చూశాం. మ‌రీ ప్యాకెట్ సైజ్ బైక్‌ను ఎప్పుడైనా న‌డిపారా?

సాధార‌ణ బైక్ మీద వెళ్లిన‌ట్లుగానే ఉంటుంది దీని మీద ప్ర‌యా‌ణం కూడా. కాకపోతే సైజులో కాస్త చిన్న‌ది. చిన్న‌పిల్ల‌లు ఆడే ఆట‌బొమ్మ‌లా ఈ బైక్ ఉంటుంది. ఈ వీడియోలో ఒక అత‌ను బైక్ మీద కూర్చొని షికారుకు వెళ్తున్నాడు. దీనిని న‌డుపుతున్న‌ప్పుడు చిన్న‌ప్ప‌టి జ్ఞాప‌కాలు గుర్తుకొస్తున్నాయి అంటున్నాడు. ప్యాకెట్ బైక్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ నెటిజ‌న్లు ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

logo