గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 19:53:03

దాగుడుమూత‌లు ఆడుతున్న శున‌కం

దాగుడుమూత‌లు ఆడుతున్న శున‌కం

లాక్‌డౌన్‌లో బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి వీళ్లేదు. అందువ‌ల్ల ఫ్రెండ్స్ అయినా బంధువులు అయినా కుటుంబ స‌భ్యులే. వీరిలో మూగ‌జీవాలు కూడా ఒక భాగ‌మే. విశ్వాసానికి మారు పేరైన కుక్క ఒక చిన్న పాప‌కి మంచి ఫ్రెండ్‌. ఈ కుక్క కు మంకీ అని పేరుపెట్టింది. వీరిద్ద‌రూ దాగుడుమూత‌లు ఆడుతున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఆ చిన్నారి దాగుడుమూత‌లు ఆడుదామా?  వెళ్లి నెంబ‌ర్లు లెక్క‌పెట్టుపో నేను దాక్కుంటాను అన‌గానే.. మంకీ గోడ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ముందున్న త‌న రెండు కాళ్ల‌తో ముఖాన్ని క‌ప్పిపుచ్చుకొన్ని నెంబ‌ర్లు లెక్క‌పెడుతుంది. మ‌ధ్య‌లో ఆ పాప ఎక్క‌డ దాక్కుంటుందో చూద్దాం అని వెన‌క్కి తిరిగి చూస్తుంది. అది కాస్త ఆ చిన్నారి గ‌మ‌నించి మంకీ నువ్వు వెన‌క్కి తిరిగి చూడ‌కూడ‌దు అని చెబుతుంది. ఆ త‌ర్వాత నేను ఎక్క‌డున్నానో క‌నిపెట్టు అని అంటుంది చిన్నారి. త‌ర్వాత మంకీ పాపని క‌నిపెట్ట‌డానికి ప‌రుగులు పెడుతుంది. వీరి హైడెన్‌సిక్ గేమ్ భ‌లే ఉంది క‌దా. ఈ వీడియోను జీఎస్‌డీ ఫ్రెండ్ అనే యూజ‌ర్ 'ఈ మంకీ నిజంగా మైడెన్‌సీక్ గేమ్ ఆడుతుందా' అనే క్యాప్ష‌న్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

logo