ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 15:52:39

దేవుడు ముఖ్యమంత్రి అయినా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేడు: గోవా సీఎం

దేవుడు ముఖ్యమంత్రి అయినా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేడు: గోవా సీఎం

పనాజీ: ప్రభుత్వ ఉద్యోగాలను అందరికీ ఇవ్వలేమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. సాక్షాత్‌ ఆ దేవుడే ముఖ్యమంత్రిగా మారినా తాను ఆకాంక్షించిన వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేడని శనివారం అన్నారు. ప్రతిష్టాత్మక 'స్వయంపూర్ణ మిత్ర' కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పంచాయతీ ప్రతినిధులతో వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ సావంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

'స్వయంపూర్ణ మిత్ర' కార్యక్రమంలో గెజిటెడ్ ప్రభుత్వ అధికారులు పంచాయతీలను సందర్శించి.. రాష్ట్ర పథకాలు క్షేత్రస్థాయిలో అమలును ఆడిట్ చేయాలని, గ్రామ వనరులపై సమగ్ర పత్రాన్ని సిద్ధం చేయాలని, గ్రామాలను స్వావలంబన చేయడానికి సూచనలు చేయాలని భావిస్తున్నారు. "నిరుద్యోగులకు నెలకు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు ఆదాయం ఉండాలి. గోవాలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. బయటి వ్యక్తులు విరుచుకుపడుతున్నారు. మన స్వయంపూర్ణ మిత్రాస్ కూడా గ్రామీణ నిరుద్యోగులకు తగిన చిన్న ఉద్యోగాలు ఏర్పాటుచేయడం వంటి పనులను సమన్వయం చేస్తుంది" అని సీఎం ప్రమోద్‌ సావంత్ తెలిపారు. రాష్ట్ర నిరుద్యోగిత రేటు ప్రస్తుతం 15.4 శాతంగా ఉండటంతో.. నిరుద్యోగం పెరగడంపై ఈ నెలారంభంలో సీఎం సావంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.