శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 00:02:27

ఈ- వెహికల్ శ్రేణిలోకి ప్రవేశించిన ఇట్రియో

ఈ- వెహికల్ శ్రేణిలోకి ప్రవేశించిన ఇట్రియో

ఢిల్లీ : భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్‌ వాహన స్టార్టప్‌ సంస్థ ఇట్రియో, ఇంట్రాసిటీ లాజిస్టిక్స్‌ను విద్యుతీకరించాలనే లక్ష్యంతో తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను నూతన విద్యుత్‌ త్రి చక్ర వాహన శ్రేణి ఉత్పత్తులను తమ బ్రాండ్‌ "టౌరో "పేరిట ఆవిష్కరించింది. కార్గో అవసరాలను తీరుస్తూ ఈ రెండు నూతన వేరియంట్లు, ఇప్పుడు అధికంగా ఇంట్రాసిటీ లాజిస్టిక్స్‌పై దృష్టి కేంద్రీకరించాయి. డెలివరీ అప్లికేషన్‌ల కోసం ఇది దృష్టి కేంద్రీకరించింది. త్రిచక్ర వాహనాల ప్యాసెంజర్‌ వేరియంట్స్‌ త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ ఆవిష్కరణలను సాధ్యం చేయడానికి ఈ కంపెనీ గత నెలలో మూడు మిలియన్‌ డాలర్లను సమీకరించింది.

పోర్చుగ్రీస్‌ పదం టోరో నుంచి టౌరో ఉద్భవించింది. దీని అర్ధం ఎద్దు. ఈ కారణంతోనే ఈ వాహన డిజైన్‌ సిద్ధాంతం ఎద్దులాగానే శక్తివంతమైన స్థిరత్వం, సాటిలేని శక్తి, అసాధారణ బరువులను తీసుకువెళ్లే సామర్థ్యం, తీవ్రమైన ఏకాగ్రతను ప్రదర్శిస్తుంది. టౌరో వాహనాలు, ఎద్దు స్ఫూర్తితో సిగ్నేచర్‌ ఫ్రంట్‌ గ్రిల్‌తో వస్తాయి. ఇట్రియో  వాహనాలు బ్రేక్‌ డ్రమ్‌లతో వస్తాయి. ఈ కంపెనీ పూర్తిగా తమ టౌరో ఫ్యామిలీ వాహనాలను స్వదేశీయంగా తయారుచేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలను పొందేందుకు అర్హత సాధిస్తుంది.

‘‘టౌరో ఆవిష్కరణతో మేము మా రెట్రోఫిట్టెడ్‌ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోకు నూతన విద్యుత్‌ వాహనాలను జోడించాం.  ఇంట్రా సిటీ లాజిస్టిక్స్‌కు విద్యుతీకరించాలనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ విభాగం కోసం ప్రత్యేకమైన విద్యుత్‌ వాహనాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం" అని ఇట్రియో టౌరో కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవో దీపక్‌ ఎంవీ తెలిపారు.