బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 02:32:57

సైన్యంలో అందరికీ సమాన అవకాశాలు

సైన్యంలో అందరికీ సమాన అవకాశాలు
  • మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తాం.. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం: సైన్యాధిపతి నరవనె

న్యూఢిల్లీ: సైన్యంలో కులం, మతం, ప్రాంతం, లింగం ఆధారంగా వివక్ష ఉండదని, మహిళలతోపాటు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని సైన్యాధిపతి ఎంఎం నరవణె తెలిపారు. సైన్యంలో మహిళా అధికారులకు సైనికదళాల కమాండర్లుగా అవకాశం ఇవ్వాలని, వారికోసం శాశ్వతకమిషన్‌ ఏర్పాటుచేయాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని, సైన్యం లో మహిళలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో 1993లోనే వారిని చేర్చుకోవడం ప్రారంభించామని నరవణె చెప్పారు. మహిళలను ఉన్నతస్థాయి పోస్టుల్లో నియమించడానికి చొరవ తీసుకుంటున్నామని వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటుపై అభిప్రాయాలు తెలుసుకోవటానికి మహిళా అధికారులకు లేఖలు పంపుతున్నట్టు చెప్పారు.


logo