బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 06:30:40

ఫీల్డ్‌ ఆఫీసులకు ఈపీఎఫ్‌ఓ మార్గదర్శకాలు

ఫీల్డ్‌ ఆఫీసులకు ఈపీఎఫ్‌ఓ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ‘ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌) కింద పెన్షనర్ల ఖాతాల్లో సకాలంలో పెన్షన్‌ జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఫీల్డ్‌ ఆఫీసులను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఆదేశించింది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఈపీఎస్‌ కింద పెన్షన్‌ పొందుతున్నారు. ‘కరోనా వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెన్షనర్లకు ఎటువంటి అసౌకర్యం కలుగనివ్వవద్దని దేశంలోని 120 ఈపీఎఫ్‌ఓ ఫీల్డ్‌ కార్యాలయాలను సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ (సీపీఎఫ్‌సీ) ఆదేశించారు.  logo
>>>>>>