శనివారం 30 మే 2020
National - May 13, 2020 , 18:36:27

ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎంఈ సంస్థలు, కార్మికులకు ఊరట

ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎంఈ సంస్థలు, కార్మికులకు ఊరట

ఢిల్లీ : ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌) పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎంఈ సంస్థలకు, కార్మికులకు కేంద్రం ఊరట కల్పించింది. ఈపీఎఫ్‌వో యాజమాన్య వాటా, కార్మికుని వాటా 12 నుంచి 10 శాతానికి తగ్గించింది. దీంతో ఎంఎస్‌ఎంఈలకు చెందిన 6.5 లక్షల సంస్థలు, 4.3 కోట్ల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఈపీఎఫ్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. వ్యాపారాలకు, కార్మికులకు మూడు నెలల పాటు మద్దతుగా ఉంటూ రూ. 2,500 కోట్ల ఈపీఎఫ్‌ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నష్టాల నుంచి కోలుకొని తిరిగి పనిని ప్రారంభించేందుకు ఈ చేయూత అందిస్తునట్లు తెలిపారు. ఇప్పటికే మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు గాను యాజమాన్య వాటా 12 శాతం, ఉద్యోగి వాటా 12 శాతాన్ని ప్రభుత్వం ఈపీఎఫ్‌ అకౌంట్లకు చెల్లించిందన్నారు. జూన్‌, జులై, ఆగస్టు నెలల ఈపీఎఫ్‌ను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. దీంతో మొత్తంగా రూ. 6,750 కోట్ల నగదు ప్రవాహం ఏర్పడనున్నట్లు తెలిపారు.


logo