గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 13:41:41

‘స్మెల్‌ టెస్టు’ చేశాకే మాల్స్‌లోకి ఎంట్రీ!

‘స్మెల్‌ టెస్టు’ చేశాకే మాల్స్‌లోకి ఎంట్రీ!

బెంగళూరు : షాపింగ్ మాల్‌కు వచ్చే ప్రజలకు స్మెల్ టెస్ట్ చేయాలని, ఎవరైనా వాసన పసిగట్టలేకపోతే వారిని షాపింగ్ మాల్‌లోకి అనుమతించకూడదని, ఈ స్మెల్ పరీక్షతో పాటు థర్మల్‌ స్కానర్ పరీక్ష కూడా చేయాలని బెంగళూరు మేయర్‌ గౌతమ్ కుమార్ సూచించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మూడు రోజుల్లో కరోనా రోగులకు వాసన పరీక్షలు చేయగల సామర్థ్యానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. షాపింగ్ మాల్స్‌లో స్మెల్ పరీక్ష తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రికి, ఆరోగ్య మంత్రికి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. 

జ్వరం-పొడి దగ్గుతో పాటు వాసన కోల్పోవడం, నాలుక నుంచి రుచి కోల్పోవడం కరోనా వైరస్ రహస్య లక్షణాలు. కరోనా రోగుల్లో చాలా మంది వాసన కోల్పోవడం ద్వారా వైరస్‌ను గుర్తించగలుగుతున్నారని యుసీ శాన్ డియాగో హెల్త్ పరిశోధకులు అంటున్నారు.

అయితే డాక్టర్ కరోల్ యాన్ నివేదిక ప్రకారం వాసన స్వభావాన్ని కోల్పోయే రోగులను దవాఖానలో చేర్పించాల్సిన అవసరం లేదు. అలాంటి లక్షణం ఉన్న రోగికి వైరస్‌ నుంచి ప్రమాదం తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇదిలా ఉండగా కర్ణాటకలో కరోనా కేసులు లక్ష దాటాయి. ఇందులో 37 వేలకు పైగా ప్రజలు కోలుకున్నారు. సుమారు 60 వేల మంది వ్యాధి బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1953 మంది మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo