బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 14:53:06

బెంగాల్‌కు దేశం యావత్తు అండగా నిలుస్తుంది: ప్రధాని మోదీ

బెంగాల్‌కు దేశం యావత్తు అండగా నిలుస్తుంది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అంఫాన్‌ తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమైన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి దేశం యావత్తు అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బెంగాల్‌లో తుఫాను సృష్టించిన విధ్వంసానికి సంబంధించి మీడియాలో ప్రసారమవుతున్న వీడియోలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయని ప్రధాని ట్వీట్‌ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం అన్ని విధాలుగా బెంగాల్‌కు సహకరిస్తుందని, బెంగాల్‌ ప్రజల క్షేమం కోసం దేశం ప్రార్థిస్తున్నదని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. 

పశ్చిమబెంగాల్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని తెలిపారు. తుఫాను తీరాన్ని తాకడానికి ముందే నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌ (NDRF)బెంగాల్‌కు చేరుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో NDRF బలగాల రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని ప్రధాని ట్వట్టిర్‌లో పేర్కొన్నారు. 


logo