గురువారం 22 అక్టోబర్ 2020
National - Oct 18, 2020 , 01:05:07

కంగనపై కేసు నమోదు చేయండి

కంగనపై కేసు నమోదు చేయండి

  • ముంబై పోలీసులకు బాంద్రా కోర్టు ఆదేశాలు

ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, ఆమె సోదరి రంగోలిపై కేసు నమోదు చేయాలని బాంద్రా మేజిస్ట్రేటు కోర్టు ముంబై పోలీసులను ఆదేశించింది. వీరు తమ ట్వీట్లు, ఇంటర్వ్యూలతో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ సాహిల్‌ అష్రాఫలి సయ్యద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో మేజిస్ట్రేటు జయదేవ్‌ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మహమ్మద్‌ ప్రవక్తను అవమానించించారన్న కోపంతో పారిస్‌లో ఓ విద్యార్థి టీచర్‌ తల నరకడంపై కంగన స్పందిస్తూ ‘తమది శాంతియుత మతం అని చెప్పుకునేవారిలాగా హిందువులు కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తే ఎప్పుడో మొత్తం బాలీవుడ్‌ తల తెగిపడి ఉండేది. వారు మన మతంపై అవమానకరమైన సినిమాలు తీశారు. ఇప్పుడు కాషాయం అంటే భయం పుడుతుంది అని చెప్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు. 


logo