శనివారం 06 జూన్ 2020
National - May 11, 2020 , 15:16:36

రోడ్డు, రైల్వే ట్రాక్‌ల‌పై వ‌ల‌స కూలీలు వెళ్ల‌కుండా చూడండి..

రోడ్డు, రైల్వే ట్రాక్‌ల‌పై వ‌ల‌స కూలీలు వెళ్ల‌కుండా చూడండి..

హైద‌రాబాద్‌: వ‌ల‌స కూలీలు త‌మ‌త‌మ ఇండ్ల‌కు వెళ్తున్న మార్గంలో అనేక ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. కొంద‌రు అన్యాయంగా త‌మ ప్రాణాల‌ను కోల్పోతున్నారు.  రోడ్ల‌పై, రైల్వే ట్రాక్‌ల‌పై న‌డుచుకుంటూ స్వంత రాష్ట్రాల‌కు వెళ్తున్న వారు కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌మాదాల‌కు బ‌ల‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. వ‌ల‌స కూలీలు ఎవ‌రూ రోడ్డు మార్గంలో కానీ, రైల్వే ప‌ట్టాల‌పై న‌డిచి వెళ్ల‌కుండా అడ్డుకోవాల‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.  కార్మికులంతా స్పెష‌ల్ రైళ్ల‌లో వెళ్లే మార్గాల‌ను ఎంచుకోవాల‌న్నారు. ఎక్కువ సంఖ్యలో శ్రామిక్ రైళ్ల‌ను న‌డిపేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌హ‌క‌రించాల‌ని హోంశాఖ కోరింది. కానీ ఇంటి బాట ప‌ట్టిన వ‌ల‌స కార్మికుల‌ను ‌ఆప‌డం లేద‌ని మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ తెలిపారు.  మాన‌వ‌తాకోణంలో ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. ముందే రైళ్ల‌ను ప్రారంభిస్తే, వ‌ల‌స కార్మికులు ఇన్ని ఇబ్బందులు ప‌డేవారు కాద‌న్నారు. logo