సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 17:19:05

సరిపడా పడకలు అందుబాటులో ఉంచాం : సీఎం కేజ్రీవాల్‌

సరిపడా పడకలు అందుబాటులో ఉంచాం : సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఢిల్లీలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు చికిత్స అందించేందుకు సరిపడా పడకలు అందుబాటులో ఉంచామని ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు ఐసీయూ పడకలు తక్కువగా ఉన్నాయని, వీటిని ఏర్పాటు చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అమోఘంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశరాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  పరిస్థితిని సమీక్షించేందుకు గురువారం ఉదయం 11 గంటలకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు ఆయన వివరించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.