బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 11:05:04

ఇంజినీరింగ్‌ విద్యార్థి దారుణ హత్య.. గుండెపై కత్తిపోట్లు

ఇంజినీరింగ్‌ విద్యార్థి దారుణ హత్య.. గుండెపై కత్తిపోట్లు

లక్నో : ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని అత్యంత దారుణంగా హత్యం చేశారు. గుండెపై సుమారు పది సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని గోమతినగర్‌లో గురువారం చోటు చేసుకుంది.

వారణాసికి ప్రశాంత్‌ సింగ్‌(23) అనే యువకుడు లక్నోలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్నాడు. అయితే ప్రశాంత్‌ తన స్నేహితుడిని కలిసేందుకు గురువారం సాయంత్రం గోమతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్దకు ఇన్నోవా కారులో వచ్చాడు. అక్కడే మాటు వేసిన 10 నుంచి 12 మంది యువకులు.. ప్రశాంత్‌ తన కారును పార్కింగ్‌ చేస్తున్న సమయంలో అడ్డుకున్నారు. ప్రశాంత్‌ కారులో ఉండగానే అతని గుండెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అటు నుంచి దుండగులు వెళ్లిపోయారు. తీవ్ర భయాందోళనకు గురైన ప్రశాంత్‌.. తన చేతిని గుండెపై పెట్టుకుని అపార్ట్‌మెంట్‌లోకి పరుగెత్తాడు. సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి చూడగా.. బాధితుడు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ప్రశాంత్‌ చనిపోయాడు. 

బర్త్‌డే పార్టీలో గొడవే కారణమా?

ప్రశాంత్‌ హత్యకు ఓ బర్త్‌డే పార్టీలో జరిగిన గొడవే కారణమని తెలుస్తోంది. బుధవారం రాత్రి ప్రశాంత్‌ తన స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లాడు. అక్కడ తన జూనియర్లతో ప్రశాంత్‌కు గొడవ జరిగింది. అది మనసులో పెట్టుకున్న జూనియర్లు, ప్రశాంత్‌పై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. 


logo
>>>>>>