బుధవారం 27 జనవరి 2021
National - Jan 13, 2021 , 14:39:57

మ‌నీల్యాండ‌రింగ్ కేసులో తృణ‌మూల్ ఎంపీ అరెస్టు

మ‌నీల్యాండ‌రింగ్ కేసులో తృణ‌మూల్ ఎంపీ అరెస్టు

కోల్‌క‌తా:  మ‌నీల్యాండ‌రింగ్ కేసులో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ కేడీ సింగ్‌ను ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ అరెస్టు చేసింది.  పీఎంఎల్ఏ చ‌ట్టం కింద ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ఈడీ చెప్పింది.  బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీలో కేడీ సింగ్ కీల‌క స‌భ్యుడిగా ఉన్నారు. కానీ ఆయ‌న గ‌త కొన్నాళ్ల నుంచి పార్టీ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటున్నారు.  కేడీ సింగ్ నివాసంలో ఇవాళ ఈడీ సోదాలు చేప‌ట్టింది. 2019 సెప్టెంబ‌ర్‌లో న‌మోదు అయిన రెండు మ‌నీల్యాండ‌రింగ్ కేసుల్లో ఆ విచార‌ణ జ‌రిగింది.  ఆల్‌కెమిస్ట్ గ్రూపు చైర్మ‌న్‌గా సింగ్ కొన్నాళ్లు చేశారు. సుమారు 1900 కోట్ల స్కామ్‌లో ఎంపీ కేడీ సింగ్ నిందితుడిగా ఉన్నారు. ఆల్‌కెమిస్ట్ ఇన్‌ఫ్రా సంస్థ‌కు చెందిన 239 కోట్ల ఆస్తుల‌ను ఈడీ జ‌ప్తు చేసింది.  అక్ర‌మ రీతిలో చిట్ ఫండ్ స్కీమ్‌ను న‌డిపిన‌ట్లు ఆ సంస్థ‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  సుమారు 1916 కోట్ల నిధుల‌ను ఆ సంస్థ మూడేళ్ల‌లో సేక‌రించింది. 


logo