మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 06:49:40

గుజ‌రా‌త్‌లో అంతు‌బ‌ట్టని కరోనా మర‌ణాలు

గుజ‌రా‌త్‌లో అంతు‌బ‌ట్టని కరోనా మర‌ణాలు

అహ్మ‌దా‌బాద్‌: గుజ‌రా‌త్‌లో కరోనా రోగుల మర‌ణాలు వైద్యు‌లను ఆశ్చ‌ర్య‌ప‌రు‌స్తు‌న్నాయి. ఈ నెల 17 సూర‌త్‌లో 70 ఏండ్ల హెమి‌బెన్‌ అనే మహిళ కరో‌నా‌నుంచి కోలు‌కొని ఇంటికి వెళ్లిన గంట‌లోపే మర‌ణిం‌చారు. రెండు నెలల క్రితం అహ్మ‌దా‌బా‌ద్‌లో చగన్‌ మక్వాలా అనే వ్యక్తి కూడా దవా‌ఖాన నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరు‌కో‌క‌ముందే మర‌ణిం‌చాడు. 

ఈ అంతు‌బ‌ట్టని మర‌ణా‌లపై రాష్ట్ర వైద్య‌శాఖ అధి‌కా‌రులు పరి‌శో‌ధ‌నలు మొద‌లు‌పె‌ట్టారు. కరోనా రోగుల్లో మెదడు ఇతర రక్త‌నా‌ళాల్లో రక్తం గడ్డ‌క‌డు‌తు‌న్న‌దని, దాంతో హటా‌త్తుగా గుండె‌పోటు వచ్చి చని‌పో‌తు‌న్నా‌రని గుజ‌రాత్‌ కొవిడ్‌ టాస్క్‌‌ఫోర్స్‌ సభ్యుడు తుషార్‌ పటేల్‌ తెలి‌పారు.


logo