శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 12:15:41

కేంద్రానిది దుర‌హంకార వైఖ‌రి : రాహుల్ గాంధీ

కేంద్రానిది దుర‌హంకార వైఖ‌రి : రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌: అగ్రిక‌ల్చ‌ర్ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ రాజ్య‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టిన 8 మంది స‌భ్యుల‌ను ఇవాళ స‌స్పెండ్ చేశారు. ఆ సంఘ‌ట‌న‌పై ఇవాళ రాహుల్ గాంధీ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ప్ర‌జాస్వామ్య భార‌త నోరు నొక్కే ప్ర‌య‌త్నం కొన‌సాగుతున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు.  తొలుత విప‌క్ష ఎంపీల స్వ‌రాన్ని వినిపించ‌కుండా చేశార‌ని, ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ నుంచి ఎంపీల‌ను స‌స్పెండ్ చేశార‌ని, ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను రూపొందించిన‌ట్లు రాహుల్ విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ నిరంకుశ విధానాల వ‌ల్ల దేశం ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంద‌ని రాహుల్ పేర్కొన్నారు. logo