ఆదివారం 12 జూలై 2020
National - Jun 03, 2020 , 10:14:41

సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు

సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్‌ : విశ్వసనీయ సమాచారం మేరకు ఉగ్రవాదుల ఆచూకీకి ఆర్మీ సిబ్బంది, స్థానిక పోలీసులు జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఈ తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవలను సస్పెండ్‌ చేశారు.

నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైతం జైషే-ఇ-మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. మృతులను కశ్మీరీవాసులుగా గుర్తించారు. సంఘటనా నుంచి రెండు పిస్టల్స్‌ను పెద్దఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


logo