శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 07:21:10

జ‌మ్ములో ఎన్‌కౌంట‌ర్‌.. శ్రీన‌గ‌ర్ జాతీయ‌ ర‌హ‌దారి బంద్‌

జ‌మ్ములో ఎన్‌కౌంట‌ర్‌.. శ్రీన‌గ‌ర్ జాతీయ‌ ర‌హ‌దారి బంద్‌

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో భ‌ద్ర‌తాద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పులు ప్రారంభ‌మ‌య్యాయి. జ‌మ్ములోని బాన్ టోల్‌ప్లాజా స‌మీపంలో ఇవాళ‌ తెల్ల‌వారుజామున ఎన్‌కౌంట‌ర్ ప్రారంభ‌మ‌య్యింది. దీంతో జ‌మ్ము-శ్రీన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిని భ‌ద్ర‌తాద‌ళాలు మూసివేశాయి. న‌గ్రోటా చెక్‌పోస్ట్ ప్రాంతంలో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉన్న‌ది. 


పుల్వామా జిల్లాలోని చౌక్‌ కాకాపోరా ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లనే లక్ష్యంగా చేసుకుని బుధ‌వారం సాయంత్రం గుర్తుతెలియ‌ని ఉగ్రవాదులు గ్రనేడ్‌ విసిరాడు. అయితే జవాన్లకు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌న‌ప్పటికీ, రద్దీగా ఉండే రహదారిపై ఆ గ్రనేడ్‌ పడి పేలిపోవడంతో 12మంది వరకు పౌరులు గాయపడ్డారు.