న్యూయార్క్ : అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో గ్యాస్ స్టేషన్ వద్ద ఓ మహిళ, మరో వ్యక్తి ఒకరిపై ఒకరు ఉమ్మి వేసుకోవడంతో పాటు బాహాబాహీకి దిగారు. సైబర్ అటాక్ తో కలోనియల్ పైప్ లైన్ మూసివేస్తారనే ఆందోళన నెలకొనడంతో పెట్రోల్ స్టేషన్ ముందు భారీ క్యూ నెలకొంది.
ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం ముదరడంతో మహిళ తన వాహనం నుంచి దిగి ముందున్న వాహనంలో వ్యక్తిని దుర్బాషలాడుతూ ఉమ్మి వేసింది. కోపంతో ఊగిపోయిన సదరు వ్యక్తి సైతం వాహనం నుంచి బయటకు వచ్చి మహిళపై ఉమ్మాడు. ఇద్దరూ పరస్పర దూషణలతో బాహాబాహీకి దిగారు. తాజాగా సోషల్ మీడియాలో వీరి ఘర్షణకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. దీంతో ఈ ఘటనలో మహిళను వేధింపులకు గురిచేసినందుకు వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళపై సాధారణ దాడి కేసు నమోదు చేశారు.
https://www.instagram.com/p/COvyhm7nu8N/?utm_source=ig_web_copy_link