e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News ఖాళీ సిరంజీతో టీకా ఇచ్చి.. కెమెరాకు చిక్కిన‌ న‌ర్సు..

ఖాళీ సిరంజీతో టీకా ఇచ్చి.. కెమెరాకు చిక్కిన‌ న‌ర్సు..

ఖాళీ సిరంజీతో టీకా ఇచ్చి.. కెమెరాకు చిక్కిన‌ న‌ర్సు..

పాట్నా: బీహార్‌లో ఓ న‌ర్సు ఖాళీ సిరంజీతో ఓ వ్య‌క్తికి టీకా ఇచ్చింది. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆ న‌ర్సును తొలగించారు. చాప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దానికి సంబంధించిన వీడియో వైర‌ల్ అయ్యింది. ప్లాస్టిక్ క‌వ‌ర్‌ నుంచి కొత్త సిరంజీ తీసిన న‌ర్సు.. నేరుగా ఓ వ్య‌క్తికి వ్యాక్సిన్ ఇచ్చింది. అయితే ఆ ప్ర‌క్రియ అంతా మొబైల్ ఫోన్‌లో షూట్ చేయ‌డంతో ఆమె దొరికిపోయింది. ఫ్రెండ్ తీసిన వీడియో గురించి తెలుసుకున్న తర్వాతే తాను ఖాళీ సిరంజీ టీకా తీసుకున్న‌ట్లు గుర్తించాని ఆ వ్య‌క్తి చెప్పాడు. అయితే ఖాళీ టీకా తీసుకుకోవ‌డం వ‌ల్ల త‌న‌కు త‌ల నొప్పు వ‌చ్చిన‌ట్లు అత‌ను చెప్పాడు. మ‌రో టీకా తీసుకోలేద‌న్నాడు. నిజానికి టీకా తీసుకుంటే ఫ్రెండ్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో తెలుసుకోవాల‌న్న ఉద్దేశంతో మ‌రో వ్య‌క్తి వీడియా తీశాడు. కానీ ఆ వీడియోను మ‌ళ్లీ చూసిన‌ప్పుడు త‌న‌కు డౌట్ వ‌చ్చింద‌ని, ప్లాస్టిక్ క‌వ‌ర్ నుంచి నేరుగా ఆ న‌ర్సు సిరంజీ తీసి త‌న ఫ్రెండ్‌కు ఇచ్చిన‌ట్లు వీడియో తీసిన వ్య‌క్తి చెప్పాడు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఖాళీ సిరంజీతో టీకా ఇచ్చి.. కెమెరాకు చిక్కిన‌ న‌ర్సు..
ఖాళీ సిరంజీతో టీకా ఇచ్చి.. కెమెరాకు చిక్కిన‌ న‌ర్సు..
ఖాళీ సిరంజీతో టీకా ఇచ్చి.. కెమెరాకు చిక్కిన‌ న‌ర్సు..

ట్రెండింగ్‌

Advertisement