సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 17:15:41

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే మా ఓటు అంటున్న ఎంప్లాయిస్

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే మా ఓటు అంటున్న ఎంప్లాయిస్

ఢిల్లీ : కరోనా మహమ్మారి రోజు రోజుకూ పెరుగుతునే ఉన్నది. దీంతో అందరి లైఫ్ స్టైల్ చేంజ్ అయిపొయింది. దేశంలోని పరిస్థితులు, కార్యాలయాల సెటప్ అన్నీ మారిపోయాయి. దేశంలోని సాఫ్ట్ వేర్, ఇతర రంగాల్లోని ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కరోనా విజృంభణ తగ్గినా పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగుల పనితీరు మెరుగుపడిందని... భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ను కొనసాగిస్తామని చెబుతున్నాయి ఆయా సంస్థలు. ఇదే సమయంలో ఉద్యోగులు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే మొగ్గుచూపుతున్నారు.

మన దేశంలో 88 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతో సౌకర్యంగా ఉందని చెప్పినట్లు యస్‌ఏపీ కాంకర్‌ సర్వే లో వెల్లడైంది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. 300 కంపెనీల కు చెందిన ఉద్యోగు లు ఈ సర్వ్ లో తమ  అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటి నుంచి పని చేస్తే ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. అంతేకాదు  ఇంటి నుంచి పని చేయడం వల్ల కంపెనీలకు ఖర్చు తగ్గుతుందని సర్వే తన నివేదికలో పేర్కొంది. వర్క్‌-ఫ్రమ్‌-హోమ్‌ అవకాశాన్ని కల్పించిన కంపెనీలు ఉద్యోగులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు ఇంటర్నెట్‌, మొబైల్‌ రీఛార్జ్, ల్యాప్ టాప్స్ లాంటి సదుపాయాలను అందిస్తున్నాయి. 


logo