బుధవారం 08 జూలై 2020
National - Jun 22, 2020 , 08:26:56

భావోద్వేగంతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

భావోద్వేగంతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

న్యూఢిల్లీ: లడఖ్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణపై ప్రజలను ‘భావోద్వేగపూరితంగా’ తప్పుదోవ పట్టించొద్దని ప్రధాని నరేంద్రమోదీకి మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత, సినీ నటుడు కమల్‌హసన్‌ సూచించారు. లడఖ్‌ ఘర్షణపై ఇటీవల జరిగిన అఖిలపక్ష భేటీలో ‘మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదు. మన సరిహద్దు చెక్‌పోస్ట్‌ను స్వాధీనం చేసుకోలేదు’ అన్న ప్రధాని మోదీ ప్రకటనను విపక్షాలు ప్రశ్నించాయి. 

ప్రధాని వ్యాఖ్యలపై విపక్షాలు తప్పుడు వక్రీకరణకు పాల్పడుతున్నాయన్న ప్రభుత్వ ప్రచారంపై కమల్‌హసన్‌ మండిపడ్డారు. ఇలాంటి ప్రచారంతోనే ప్రజలను భావోద్వేగ పూరితంగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి పనులు నిలిపేయాలని ప్రధాని మోదీ, ఆయన మద్దతుదారులను కోరారు. ప్రశ్నించిన వారిపై జాతివ్యతిరేకుల ముద్ర వేయడం సరి కాదన్నారు. 


logo