శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 00:54:15

ఎల్గార్‌ పరిషత్‌ కేసు..

ఎల్గార్‌ పరిషత్‌ కేసు..
  • ఎన్‌ఐఏ కోర్టులో నిందితులు హాజరు

ముంబై: ఎల్గార్‌ పరిషత్‌ కేసులో అరెస్టు అయిన 9 మంది నిందితులను శుక్రవారం ముంబైలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వీరిలో వరవరరావు, సురేంద్ర గాడ్లిగ్‌, మహేశ్‌ రౌత్‌, రోనా విల్సన్‌, సుధీర్‌ ధవాలే, అరుణ్‌ ఫెరీరా, సుధా భరద్వాజ్‌, షోమా సేన్‌, వెర్నన్‌ గోంజాల్వెజ్‌ ఉన్నారు. 2017 డిసెంబర్‌ 31న పుణెలోని శనివార్‌వాడా ప్రాంతంలో నిర్వహించిన ‘ఎల్గార్‌ పరిషత్‌' సదస్సు సందర్భంగా వీరంతా విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారని, దీంతో మరుసటి రోజు కోరెగావ్‌ భీమా వద్ద హింస చెలరేగిందని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును ఇటీవల ఎన్‌ఐఏకు అప్పగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చారు. 


logo