మంగళవారం 19 జనవరి 2021
National - Dec 19, 2020 , 15:45:10

బీజేపీలోకి 11 మంది తృణ‌మూల్‌ ఎమ్మెల్యేలు

బీజేపీలోకి 11 మంది తృణ‌మూల్‌ ఎమ్మెల్యేలు

 కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇటీవ‌ల‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కీల‌క‌ నేత సువేందు అధికారి.. తాను పోవ‌డ‌మేగాక త‌న‌తోపాటు మ‌రో 10 టీఎంసీ ఎమ్మెల్యేల‌ను వెంట తీసుకెళ్లాడు. సువేందు వెంట మ‌హా అయితే మ‌రో ముగ్గురు, న‌లుగురు ఎమ్మెల్యేలు వెళ్తార‌ని తృణ‌మూల్ ముందుగానే ఊహించింది. అయితే వారి అంచ‌నాల‌కు మించి ఇప్పుడు ఏకంగా 11 మంది (సువేందుతో క‌లిపి) టీఎంసీని వీడి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఇవాళ అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేరిన బెంగాల్‌ ఎమ్మెల్యేల్లో సువేందు అధికారి, తాప‌సి మొండ‌ల్‌, అశోక్ దిండా, సుదీప్ ముఖ‌ర్జి, సైక‌త్ పంజా, షిభ‌ద్ర ద‌త్త‌, దీపాలి బిశ్వాస్‌, సుక్రా ముండా, శ్యామ‌ప్ద ముఖ‌ర్జి, విశ్వ‌జిత్ కుందు, బ‌న‌శ్రీ మైతీ ఉన్నారు. వారితోపాటు ప‌ర్బ బుర్ద్వాన్ నియోజ‌క‌వ‌ర్గ‌ ఎంపీ సునీల్ మొండ‌ల్‌, మాజీ ఎంపీ ద‌శ‌ర‌థ్ టిర్కీ కూడా అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు.     


‌ ఇవి కూడా చ‌ద‌వండి.. 

బీజేపీలో చేరిన సువేందు అధికారి

రైతు ఇంట్లో అమిత్‌ షా, బీజేపీ నేతల భోజనం

దుకాణంలో అగ్నిప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

గుండెపోటుతో శివ‌సేన సీనియ‌ర్ నేత మృతి

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.