ఆదివారం 07 జూన్ 2020
National - Apr 05, 2020 , 12:31:54

ఏనుగులకు కూడా లాక్ డౌన్ ఉందా..? వీడియో

ఏనుగులకు కూడా లాక్ డౌన్ ఉందా..? వీడియో

క‌ర్ణాట‌క‌: సాధారణంగా ఏనుగుల మంద అప్పుడ‌పుడు అట‌వీ ప్రాంతంలో నుంచి జ‌నావాసాల్లోకి వ‌చ్చి వీరంగం చేస్తుంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. క‌ర్ణాట‌క‌లోని కొడ‌గు జిల్లా మాల్దారే జంక్ష‌న్ లో నుంచి ఓ గ‌జ‌రాజుల గుంపు మాత్రం ఎలాంటి హ‌ల్ చ‌ల్ చేయ‌కుండా నిదానంగా వాటి దారిన అవి వెళ్లిపోయాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో జ‌నాలంతా ఇండ్లలో నుంచి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో..రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారాయి.

గ‌జ‌రాజాలు మ‌నుషులను చూసి అప్ప‌డ‌పుడు గ్రామాల్లోకి చొర‌బ‌డేవి..కానీ ఈ సారి మాత్రం మ‌నుషులెవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డంతో.. మాకు కూడా లాక్ డౌన్ రూల్స్ అమ‌లులో ఉన్నాయి అన్న‌ట్లు ఏనుగుల మంద ఇలా రోడ్డుపైకి వ‌చ్చి అలా అడ‌విలోకి వెళ్లిపోయింది. ఓ ఫారెస్ట్ అధికారి వాటిని వీడియో తీసి ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు.ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo