బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 15:28:16

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఏనుగుల దాడి.. ముగ్గురు మృతి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఏనుగుల దాడి.. ముగ్గురు మృతి

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. అనుప్ప‌ర్ జిల్లాలోని ప‌ర్బా గ్రామంపై ఒక ఏనుగుల మంద దాడి చేసి బీభ‌త్సం సృష్టించింది. ఈ దాడిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు స‌హా ముగ్గ‌రు మృతిచెందారు. గురువారం ఉద‌యం స‌మీప అడ‌వుల్లోంచి 10 నుంచి 12 ఏనుగులు గ‌ల‌ మంద ప‌ర్బా గ్రామం శివార్ల‌లోని పంట పొలాల్లోకి ప్ర‌వేశించింది. ఒక్క‌సారిగా మీద‌కు దూసుకొస్తున్న‌ మంద‌ను చూసి అక్క‌డే పొలాల్లో ప‌నిచేస్తున్న వారు ప‌రుగులు తీశారు. అయినా వారిలో ముగ్గ‌రిపై ఏనుగుల మంద దాడి చేసింది. ఈ దాడిలో ఒక మ‌హిళ స‌హా ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో మ‌హిళ పుష్ప‌రాజ్‌గంజ్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. 


logo