గురువారం 09 జూలై 2020
National - Jun 29, 2020 , 21:08:14

ఉత్తరాఖండ్‌లో ఏనుగుల సంఖ్య పెరిగింది: సీఎంవో

ఉత్తరాఖండ్‌లో ఏనుగుల సంఖ్య పెరిగింది: సీఎంవో

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఏనుగుల సంఖ్య పెరిగినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,026 ఏనుగులున్నట్లు తెలిపింది. కాగా, 2017లో ఈ సంఖ్య 1,839 ఉండేదని పేర్కొంది. ఫారెస్ట్‌ అధికారులు ఈ నెల 6నుంచి 8 వరకు ఏనుగుల లెక్కింపు నిర్వహించి, వివరాలను సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌కు అందజేసినట్లు చెప్పింది. 

  రాష్ట్ర వన్యప్రాణి సలహా మండలి 15 వ సమావేశానికి రావత్ సోమవారం అధ్యక్షత వహించారు. ‘2012లో 1,559 ఏనుగులు ఉండగా, 2017 లో 1,839 ఏనుగులు ఉన్నాయి. 2017 నుంచి ఏనుగుల సంఖ్య 10.17 శాతం పెరిగింది’ అని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అలాగే, ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 24 వరకు జల జంతుజాలాన్ని లెక్కించారు. రాష్ట్రంలో 451 మొసళ్ళు, 77 ఘారియల్స్, 194 నీటి కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, 2020 నుంచి 2022 వరకు రాష్ట్రంలో స్నో లియోపార్డ్‌ జనాభాను కూడా అంచనా వేస్తామని అధికారులు రావత్‌కు తెలిపారు. కార్బెట్ రిజర్వ్, రాజాజీ టైగర్ రిజర్వ్‌లో ఖడ్గమృగాన్ని తిరిగి ప్రవేశపెట్టే పనులను సమయానుసారంగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. logo