ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 07:16:24

అట‌వీ రేంజ్ ఆఫీస‌ర్‌ను చంపిన ఏనుగు

అట‌వీ రేంజ్ ఆఫీస‌ర్‌ను చంపిన ఏనుగు

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నా టైగ‌ర్ రిజ‌ర్వ్ (పీటీఆర్‌)లో ఏనుగు చేతిలో ఓ అట‌వీ అధికారి బ‌ల‌య్యాడు. అట‌వీ ప్రాంతంలో రెండు పులుల మ‌ధ్య జ‌రిగిన పోరాటంలో మ‌రో పులి చ‌నిపోయింది. దీంతో  ఆ పులిని గుర్తించడానికి హినోటియా రేంజ్ ఆఫీస‌ర్ ఆర్కే భ‌గ‌త్, మ‌రో ముగ్గురు ట‌స్క‌ర్లతో క‌లిసి నిన్న రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్లారు.  

రామ్ బ‌హ‌దూర్ అనే ఏనుగు వారిపై ఒక్క‌సారిగా దాడి చేసింద‌ని, భ‌గ‌త్‌ను తొండంతో బలంగా కొట్టి, త‌న దంతాల‌తో పొడిచి చంపింద‌ని అట‌వీ అధికారి ఆర్కే గురుదేవ్ వెల్ల‌డించారు. అయితే ఈ దాడికి కార‌ణ‌మేంట‌నే విష‌యం ఇంకా తెలియ‌లేద‌ని వెల్ల‌డించారు.   


logo