సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 14:10:11

క‌రోనా టైంలో ఆలింగ‌నం చేసుకున్న ఏనుగు, ఖ‌డ్గ‌మృగం!

క‌రోనా టైంలో ఆలింగ‌నం చేసుకున్న ఏనుగు, ఖ‌డ్గ‌మృగం!

ఏనుగు ఒక ఖ‌డ్గ‌మృగాన్ని కౌగిలించుకునే వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ న‌వ్విస్తుంది. 16 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే ఈ వీడియో వేల వీక్ష‌కుల‌ను సంపాదించుకున్న‌ది.

క్లిప్‌లో చూసిన‌ట్ల‌యితే న‌ది ఒడ్డున ఏనుగు త‌న తొండంతో ఖ‌డ్గ‌మృగాన్ని కౌగిలించుకున్న‌ది. "సరళమైన కౌగిలిలో ఏదో ఉంది. ఇది ఎల్లప్పుడూ హృదయాన్ని వేడి చేస్తుంది. మీ హృదయాన్ని వేడి చేయడానికి ఏనుగు ఖడ్గమృగాన్ని కౌగిలించుకుంటుంది" అని సుశాంత నందా శీర్షిక‌లో తెలియ‌జేశారు. దీనిని చూసిన వారంతా 'అమేజింగ్', 'సూప‌ర్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రొక‌రేమో.. క‌రోనా టైంలో ఎలాంటి భ‌యం లేకుండా ఎంత ఆనందంగా ఉన్నాయో అదృష్ట వంతులు అని కామెంట్ చేశారు. 
logo