గురువారం 09 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 02:47:47

పార్టీ నాయకత్వానికి ఎన్నికలు నిర్వహించాలి

పార్టీ నాయకత్వానికి ఎన్నికలు నిర్వహించాలి
  • సీడబ్ల్ల్యూసీని కోరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌

న్యూఢిల్లీ: కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు.. ఓటర్లకు స్ఫూర్తి కలిగించేలా పార్టీలో నాయకత్వ స్థానాలకు ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్ల్యూసీ)ని గురువారం కోరారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ లేమి అనే పెద్ద సవాలును ఎదుర్కొంటున్నదని, నెలలు గడుస్తున్నా కొత్త అధ్యక్షుడిని వెతకడంలో సీనియర్‌ నాయకలు విఫలమయ్యారని, వారంతా పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలని భయపడుతున్నారంటూ పార్టీలో తన సహచరుడు, మాజీ ఎంపీ సందీప్‌దీక్షిత్‌ వ్యాఖ్యల అనంతరం శశిథరూర్‌ పైవిధంగా ట్వీట్‌ చేశారు. పార్టీలో బాధ్యతగల ఉన్నత పదవుల్లో ఉన్నవారు, డజన్లకొద్దీ నాయకులు చాటుగా ఇదే అంటున్నారని ఆయన తెలిపారు. కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు, ఓటర్లలో ప్రేరణ కలిగించేందుకు పార్టీలో నాయకత్వ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని తాను సీడబ్ల్యుసీని మరోసారి కోరుతున్నానని థరూర్‌ చెప్పారు. ‘ఎవరు ఓటెయ్యాలి, దేని కోసం అని కొందరు ప్రశ్నించారని, దానికి ఏఐసీసీతోపాటు పీసీసీ ప్రతినిధుల జాబితాలోని 10,000 మంది పార్టీ కార్యకర్తల మధ్య ఎన్నికలు జరుగాలని ఎనిమిది నెలల కిందట చెప్పినదే మళ్లీ సూచిస్తానని చెప్పారు. 


logo