సోమవారం 13 జూలై 2020
National - Jun 15, 2020 , 15:04:41

బీహార్‌లో 9 మండలి స్థానాలకు జూలై 6న ఎన్నిక

బీహార్‌లో 9 మండలి స్థానాలకు జూలై 6న ఎన్నిక

న్యూఢిల్లీ: బీహార్‌లో ఖాళీ అయిన 9 శాసన మండలి  స్థానాలకు జూలై 6న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. ఈ ఎన్నికల కోసం ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 25గా పేర్కొంది. జూలై 6న సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వెల్లడించింది. పోలింగ్‌ అనంతరం అదే రోజున ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొంది. 


logo