శనివారం 11 జూలై 2020
National - Jun 19, 2020 , 08:49:07

24 సీట్ల‌కు ఇవాళ రాజ్య‌స‌భ ఎన్నిక‌లు..

24 సీట్ల‌కు ఇవాళ రాజ్య‌స‌భ ఎన్నిక‌లు..

హైద‌రాబాద్‌: మ‌రికాసేప‌ట్లో 24 సీట్ల‌కు రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మార్చిలో జ‌ర‌గాల్సిన ఆ ఎన్నిక‌లు క‌రోనా వైర‌స్ వ‌ల్ల వాయిదా ప‌డ్డాయి. ఆ ఎన్నిక‌ల‌ను ఇవాళ నిర్వ‌హిస్తున్నారు. మొత్తం ప‌ది రాష్ట్రాల్లో ఈ ఎన్నిక‌లు జ‌ర‌గుతున్నాయి. గుజ‌రాత్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో నాలుగు సీట్ల‌కు, మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో మూడు సీట్ల‌కు, జార్ఖండ్ నుంచి రెండు సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాల‌యా, మ‌ణిపూర్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటుకు రాజ్య‌స‌భ ఎన్నిక జ‌ర‌గ‌నున్న‌ది. ఉద‌యం 9 గంట‌ల‌కు ఓటింగ్ ప్రారంభం అవుతుంది. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటుకు చాలా గ‌ట్టి పోటీ ఉన్న‌ట్లు తెలుస్తోంది.logo