శుక్రవారం 10 జూలై 2020
National - Jun 19, 2020 , 02:25:15

నేడు 19 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు

నేడు 19 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు

న్యూఢిల్లీ, జూన్‌ 18: దేశవ్యాప్తంగా శుక్రవారం 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 24 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా కర్ణాటకలో నాలుగు సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ఈ నాలుగు స్థానాల్లో మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్‌ సీనియర్‌నేత మల్లికార్జున ఖర్లే, బీజేపీ నేతలు ఈరన్న కాదడి, అశోక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్న ఒకే స్థానానికి నాబం రేబియా ఎన్నికయ్యారు. మిగిలిన 19 సీట్లలో ఏపీ, గుజరాత్‌ నుంచి నాలుగు చొప్పున, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ నుంచి మూడు చొప్పున స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జార్ఖండ్‌లో రెండు, మణిపూర్‌, మిజోరం, మేఘాలయలో ఒక్కో సీటుకు ఎన్నికలు జరుగనున్నాయి. మణిపూర్‌లో 9మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ జరుగుతుంది.


logo