శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 09:04:42

బీహార్ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించ‌నున్న ఈసీ!

బీహార్ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించ‌నున్న ఈసీ!

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీలు నేడు వెలువ‌డ‌నున్నాయి. ఈ మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించ‌నుంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ కాల‌ప‌రిమితి న‌వంబ‌ర్ 29తో ముగియ‌నుంది. రాష్ట్రంలో ఆలోపు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ది. దీంతో ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్నిఏర్పాట్లు చేస్తున్న‌ది.  

వ‌చ్చేనెల రెండో వారంలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. అదేవిధంగా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఒక‌టి కంటే ఎక్కువ విడుత‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. దేశంలో క‌రోనా నేప‌థ్యంలో జ‌రుగుతున్న మొద‌టి ఎన్నిక‌లు ఇవే కావ‌డం విశేషం.