బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 13:01:07

కేంద్ర ఎన్నిక‌ల సంఘం బీజేపీలో ఓ భాగం: శివ‌సేన

కేంద్ర ఎన్నిక‌ల సంఘం బీజేపీలో ఓ భాగం: శివ‌సేన

ముంబై: ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ECI)పై శివ‌సేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈసీఐ బీజేపీలోని ఓ విభాగ‌మ‌ని విమ‌ర్శించారు. బీజేపీ ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఈసీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నుకోవ‌డం అత్యాశే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బీజేపీ నేత‌లు అంద‌రికీ ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్ ఇస్తామ‌ని హామీలు గుప్పిస్తున్నారు. దీనిపై ప్ర‌తిప‌క్ష పార్టీలు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదును ప‌రిశీలించిన ఈసీఐ.. బీజేపీ వ్యాక్సిన్ హామీ వ‌ల్ల ఎలాంటి ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న జ‌రుగ‌లేద‌ని తేల్చిచెప్పింది. 

అయితే, కేంద్ర ఎన్నిక‌ల సంఘం బీజేపీ ప్ర‌చారాన్ని స‌మ‌ర్థించిన విష‌యాన్ని మీడియా శివ‌సేన అధికార ప్ర‌నిధి సంజ‌య్ రౌత్ ముందు ప్ర‌స్తావించి స్పంద‌న కోరింది. దాంతో ఆ విష‌యంపై స్పందించిన సంజ‌య్ రౌత్ పై వ్యాఖ్య‌లు చేశారు. ( చూడండి : అడవుల మధ్య అందాల జలపాతం.. వీడియో)

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.