శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 14:26:24

ఉప ఎన్నికలు వాయిదా: ఈసీ

ఉప ఎన్నికలు వాయిదా: ఈసీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తితోపాటు కొన్ని రాష్ట్రాల్లో వరద పరిస్థితుల దృష్ట్యా లోక్‌సభ ఉప ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్ర అసెంబ్లీలకు ఉప ఎన్నికలను సెప్టెంబర్ 7 వరకు భారత ఎన్నికల సంఘం (ఈసీ) వాయిదా వేసింది. పరిస్థితులు మెరుగుపడిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టంచేసింది.

ఈ ఏడాది ప్రారంభంలో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి నిష్క్రమించిన తరువాత 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మార్చి 10 న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. అనంతరం వారంతా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి రాజీనామా చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951, సెక్షన్ 151-ఏ ప్రకారం.. 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను సెప్టెంబర్ 10 లోపు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే, మధ్యప్రదేశ్‌తోపాటు, అసోం, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కూడా ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా ఈ ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు గతంలో వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గిన తర్వాత ఉప ఎన్నికలు జరిపేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది.


logo