బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 13:56:28

న‌డిరోడ్డు మీద మ‌హిళ‌పై దాడి.. నిందితుడు అరెస్ట్‌

న‌డిరోడ్డు మీద మ‌హిళ‌పై దాడి.. నిందితుడు అరెస్ట్‌

ఘ‌జియాబాద్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఘ‌జియాబాద్ జిల్లాలోని క‌వి న‌గ‌ర్ ఏరియాలో దారుణం జ‌రిగింది. ఓ యువ‌కుడు మ‌హిళ‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డాడు. న‌డిరోడ్డు మీద ఆమెను ప‌డేసి జ‌ట్టుప‌ట్టి ఈడ్చాడు. ఈ నెల 12న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడు సునీల్ చౌద‌రిని అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాధిత మ‌హిళ, సునీల్ చౌద‌రి ఇద్ద‌రూ క‌వి న‌గ‌ర్ ఏరియాలోని ప‌క్క‌ప‌క్క ఇండ్ల‌లో నివ‌సిస్తున్నారు. అయితే బాధితురాలి కూత‌రును సునీల్ త‌ర‌చూ వేధిస్తుండ‌టంతో గొడ‌వ జ‌రిగింది. మాటామాటా పెరుగ‌డంతో సునీల్ బాధితురాలిపై దాడికి పాల్ప‌డ్డాడు. కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.         

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo