శనివారం 04 జూలై 2020
National - Jun 22, 2020 , 09:54:26

అమ్మ‌మ్మ‌, మ‌న‌వ‌రాళ్ల ప‌ల్లె ఆట‌ : వీడియో వైర‌ల్‌

అమ్మ‌మ్మ‌, మ‌న‌వ‌రాళ్ల ప‌ల్లె ఆట‌ :  వీడియో వైర‌ల్‌

బాల్యంలో అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌లతో ఆడుకున్న మ‌ధుర‌మైన క్ష‌ణాలు చాలా ఆనందాన్నిస్తాయి. ఉన్న‌ప్పుడు వారి విలువ తెలియ‌దు. తెలిశాక వారు ఉండ‌రు. అందుకే ముస‌వివాళ్లు అని చుల‌క‌న చేయ‌కుండా వారితో విలువైన స‌మ‌యాన్ని గ‌డ‌పాలంటూ ట్విట‌ర్ యూజ‌ర్ రాజ్ ఒక వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. దాదాపు రెండు నిమిషాల పాటు న‌డిచే ఈ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది.

ఒక వృద్ధ‌ మ‌హిళ మ‌న‌వ‌రాలితో క‌లిసి రాళ్ల‌తో ఆటాడుతున్న‌ది. ఈ ఆట‌ను కొంత‌మంది అచ్చనగండ్లు, అచ్చనగాయలుగా పిలుస్తారు. అమ్మ‌మ్మ ఆడుతుంటే మ‌న‌వ‌రాలు తిల‌కిస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియో 21 వేల‌కు పైగా లైక్స్ సంపాదించుకున్న‌ది. అంతేకాదు 349K మంది వీక్షించారు. పిల్ల‌లు త‌మ అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌ల‌తో ఎందుకు గ‌డ‌పాలి అనే శీర్షిక‌తో రాజ్ షేర్ చేశారు. 'లవ్లీ. నేను నా నానితో ఆడాను. భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. నా కొడుకుతో మళ్లీ ఆడాలని నాకు గుర్తు చేసింది'  అని మ‌రికొంత‌మంది త‌మ అమ్మ‌మ్మ‌ల‌ను గుర్తుచేసుకుంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 

   


logo