గురువారం 09 జూలై 2020
National - Jun 19, 2020 , 15:56:35

అడవి ఏనుగు దాడిలో మహిళ మృతి

అడవి ఏనుగు దాడిలో మహిళ మృతి

జస్పూర్‌ : అడవి ఏనుగు దాడిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం జస్పూర్‌ జిల్లాలో నేడు చోటుచేసుకుంది. మహువా గ్రామ సమీపంలో బుదియారో బాయ్‌(62) అనే మహిళ పొలంలో పని చేసుకుంటుండగా అడవి ఏనుగు వచ్చి ఒక్కసారిగా దాడి చేసింది. మహిళను ఏనుగు తన తొండంతో పైకిలేపి నేలకేసి కొట్టింది. దీంతో బాధిత మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలిసిన వెంటనే అటవీ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సమీప అటవీప్రాంతం నుంచి 18 ఏనుగుల సమూహం గుంపుగా తిరుగుతున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. ఆరు గ్రామాల్లో పలు ఇళ్లను సైతం ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లో గడిచిన 11 రోజుల్లో 6 ఏనుగులు అనుమానాస్పదరీతిలో మృతిచెందాయి. 


logo