ఆదివారం 05 జూలై 2020
National - Jun 25, 2020 , 17:15:20

చీర‌క‌ట్టులో బామ్మ ఆస‌నాలు.. నోరెళ్ల‌బెట్ట‌డం ఖాయం!

చీర‌క‌ట్టులో బామ్మ ఆస‌నాలు.. నోరెళ్ల‌బెట్ట‌డం ఖాయం!

కుర్చీలో కూర్చున్న‌ప్పుడు పెన్ కింద‌ప‌డితేనే తీయ‌డానికి క‌ష్ట‌ప‌డిపోతాం. అలాంటిది ఈ బామ్మ‌కి క‌నీసం 60, 70 ఏండ్లు ఉండొచ్చు. రెండు చేతుల‌తో అవ‌లీల‌గా కాళ్ల బొట‌న‌వేలును ప‌ట్టుకోవ‌డ‌మే కాకుండా న‌డిచి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది. వివిధ ర‌కాల యోగా ఆస‌నాలు వేసింది. అది కూడా అనుకూలంగా ఉండ‌ని చీర‌క‌ట్టులోనే. ఈ బామ్మ‌ను చూసి అయినా వ‌య‌సులో ఉన్న‌వారు చాలా నేర్చుకోవాలి.

ఈ వీడియోను ఇండియ‌న్  ఫారెస్ట్ స‌ర్వీస్‌కు చెందిన సుధా రామెన్ 51 సెకండ్ల క్లిప్‌ను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఒక ఆస‌నం నుంచి మ‌రొక ఆస‌నం వేయ‌డానికి ఊపిరి పీల్చుకునేంత స‌మ‌యం కూడా ఇవ్వ‌డం లేదు. ట‌కట‌కా ఆస‌నాలు వేయ‌డం విశేషం. 'మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తుంది' ‌ అనే శీర్షిక‌తో షేర్ చేశారు సుధా. వీడియోకు కామెంట్లు చేయ‌డానికి చాలామంది మొగ్గుచూపుతున్నారు. 


logo