మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Jul 09, 2020 , 18:28:37

క‌రోనా భ‌యంతో ఆత్మ‌హ‌త్య‌.. రిపోర్టు మాత్రం నెగిటివ్

క‌రోనా భ‌యంతో ఆత్మ‌హ‌త్య‌.. రిపోర్టు మాత్రం నెగిటివ్

జైపూర్ : ఓ వృద్ధుడు క‌రోనా భ‌యంతో ఆస్ప‌త్రి రెండో అంత‌స్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కానీ ఫ‌లితం మాత్రం క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. ఈ విషాద ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్ లో చోటు చేసుకుంది. ల‌క్ష్మ‌ణ్‌(78) అనే వ్య‌క్తి క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరాడు. అయితే అక్క‌డ స‌రైన సౌక‌ర్యాలు లేవు. కొవిడ్ నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోలేదు డాక్ట‌ర్లు. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన ల‌క్ష్మ‌ణ్‌.. ఆస్ప‌త్రి రెండో అంత‌స్తు నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఆ ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది గంట‌ల‌కే అత‌ని ఫ‌లితం క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. వృద్ధుడి ఆత్మ‌హ‌త్య‌తో కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo